కుప్పం, ఆంధ్రప్రభ : కుప్పం జనం చిరకాల కల నెరవేరింది. కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ – నీవా ప్రాజెక్టులోని కుప్పం బ్రాంచ్ కెనాల్ లో కృష్ణా జిల్లాలు బిరబిరా పరుగులు తీశాయి. కృష్ణమ్మ పలకరింపుతో కుప్పం (Kuppam) జనం ఆనంద తాండవం చేశారు. శనివారం పరమ సముద్రానికి చేరుకోగా.. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు హారతి పట్టి స్వాగతం పలికారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు (CM’s special pooja) చేశారు. శాంతిపురం మండలంలోని పరమ సముద్రం చెరువు కృష్ణాజలాలతో తొణికసలాడుతోంది. కృష్ణా జలాలకు హారతి, సారె సమర్పించడానికి రెండు రోజుల పర్యటన కోసం సీఎం చంద్రబాబు సతీసమేతంగా కుప్పం చేరుకున్నారు..
పరమసముద్రం చెరువు వద్ద జలహారతి ఇచ్చారు. ఈ చెరువు నుంచి కుప్పం, పలమనేరులోని 110 చెరువులను అనుసంధానం చేస్తోంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం (Shantipuram) మండలం తుమ్మిసి గ్రామం సమీపంలో కాల్వ వద్ద ప్రత్యేకంగా ఘాట్ ఏర్పాటు చేశారు. దీనికి దగ్గరలోనే 18 అడుగుల చిరస్మరణీయ పైలాన్ నిర్మించారు. కాల్వలో నీటి లోతు పరిశీలించడం, పరిసర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాయలసీమ (Rayalaseema) వరప్రసాదినిగా భావించే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వకు నంద్యాల సమీపంలోని మల్యాల ఎత్తిపోతల వద్ద జులై 17న కృష్ణా జలాలను విడుదల చేశారు. ఆగస్టు 23 న కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం వరికుప్పం వద్దకు కృష్ణాజలాలు చేరాయి.

చివరి మజిలీగా పరమసముద్రంలోకి 25వ తేదీ చేరాయి. ప్రస్తుతం ఈ చెరువులు కృష్ణా జలాలతో కళకళలాడుతున్నాయి. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చే సమయానికి హంద్రీనీవా (Handreeniva) కాల్వ వెంబడి నియోజకవర్గంలోని 25 ప్రదేశాల్లో రైతులతో పూజలు చేశారు. ఈ ఏడాది రూ.3,850 కోట్లు వెచ్చించి కృష్ణాజలాల ను కుప్పం నియోజకవర్గానికి తెచ్చేందుకు వెచ్చించారు. 110 చెరువులను అనుసంధానం చేసి, 6,400 ఎకరాల ఆయకట్టుకు, నాలుగు మండలాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితమే కృష్ణాజిల్లాలో కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టాయి.
నియోజకవర్గంలోని రామకుప్పం వద్ద కాలువలోకి చేరుకున్న నీళ్లను చూసి స్థానికులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. స్థానికులు, టిడిపి నేతలు హంద్రీనీవా కాలువలో దిగి కృష్ణా నీటిని ముద్దాడారు. ఆ నీళ్లను తాకి పరవశించిపోయారు. దశాబ్దాల కల నెరవేర్చిన చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు కుప్పం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనందంలో పాలు పంచుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే హోదాలో స్వయంగా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంకు చేరుకున్నారు.. కుప్పం మండలం పరమసముద్రం వద్ద నిర్మించిన హంద్రీ నీవా కాలువ వద్ద కృష్ణా జిల్లాలకు స్వాగతం పలికారు. ఇక్కడే సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. కృష్ణమ్మ (Krishnamma) కు ప్రత్యేక పూజలు చేశారు.
ఇది సీఎం చిరకాల విజన్..
ఇదంతా రాత్రికి రాత్రి జరగలేదు. 1999 జులై 9న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబు హంద్రీనీవాకు శంకుస్థాపన చేశారు. 2014- 19 మధ్య గతేడాది నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల (Irrigation projects) పై నిధుల ఖర్చు చేయడం వల్ల నేడు కృష్ణాజలాలు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో వందరోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు (Lining works) పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచారు. చివరికి కుప్పం ప్రజల జలకళ కల నెరవేరింది.
