హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ(Assembly)లో వాడీవేడీగా బీసీ బిల్లు (BC Bill)పై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీని విడిచి నెమ్మదిగా జారుకున్నారు. ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోతున్నారని చర్చ జరిగింది. కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (Kerala, Congress senior leader KC Venugopal) ఏర్పాటు చేసే బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు సమాచారం. “కేసీఆర్ (KCR) అసెంబ్లీకి రారని గగ్గోలు పెట్టే సీఎం రేవంత్ రెడ్డి, ఒక బుక్ లాంచ్ కోసం అసెంబ్లీ సెషన్‌ను సైతం ఎగ్గొట్టడం ఎలా?” అంటూ నెట్‌జనులు విమర్శలు గుప్పిస్తున్నారు.
అసెంబ్లీ నుంచి జారుకున్న సీఎం
