CM Revanth Reddy | తీరుపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం…

CM Revanth Reddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బిఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బిక్కనూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై సెట్ విచారణ జరపడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిటీ విచారణ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.

రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సిట్ విచారణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు భూమిరెడ్డి, మహేందర్ రెడ్డి, వేణు, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డి, సాయి రెడ్డి, శివానందం, గౌడ్ సిద్ధా గౌడ్, బాల్ చంద్రం, రాజమౌళి, నరసారెడ్డి, యాదగిరి, రవి, సత్యనారాయణ, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply