Sangareddy : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్

సంగారెడ్డి: పాశమైలారం ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. సీఎం వెంట మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, పొంగులేటి, రాజనర్సింహ ఉన్నారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. పాశమైలారం (Pashamylaram) పేలుడు ఘటనలో ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 43కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply