CM Revanth | సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి

CM Revanth | సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి

నిర్మల్ లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు

CM Revanth | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హిందూ దేవుళ్ళను అవమాన పరుస్తూ, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మ(CM effigy) దహనం చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ముస్లిం అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే ముస్లిం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవీదేవతలను ఇలా అవమానపరచడంపై అగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర మతస్తుల దేవుళ్లపై వ్యాఖ్యలు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళను తూలనాడిన సిఎం ముక్కు నేలకురాసి హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు(senior leaders) రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, జిల్లా BJYM అధ్యక్షులు ఒడిసెల అర్జున్, అల్లం భాస్కర్, రామోజీ నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు ఓడ్నాల రాజు, నాయకులు పొన్నం నారాయణ గౌడ్, ఆడెపు సుధాకర్, తోట సత్యనారాయణ, అయ్యన్న రాజేందర్, కొండాజి శ్రావణ్, విజయ్, జప ప్రసాద్, గంజి రాజు, రంజిత్, దిలీప్, సాత్విక్, త‌దిత‌రులున్నారు.

Leave a Reply