రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు…

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు…
విప్, ఎమ్మెల్యే వేముల.
చిట్యాల, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, ప్రభుత్వ విప్, నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం తెలిపారు. మంగళవారం నాడు చిట్యాల తో పాటు వట్టిమర్తి, వని పాకల, ఆరెగూడెం, పెద్దకాపర్తి, వెలిమినేడు, సుం కెనపల్లి, గుండ్రంపల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం మద్దతు ధర తో పాటు సకాలంలో ధాన్యం కొనుగోలు చర్యలపై ఆయన హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కనుక రైతుల బాధలు తెలిసిన వ్యక్తి గనుక రైతులకు పండించిన పంటకు బోనస్, రుణమాఫీ, రైతు భరోసా అనేక సంక్షేమ పథకాల ను అమలు చేయడం జరుగుతున్నదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం విచ్చిన్నం చేసిందని అయినా కూడా రైతులకు ఇచ్చిన మాటను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు బాగుండాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ముందుకు సాగుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, ఎఎంసి చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, సర్పంచులు కాటం వెంకటేశం, ఆవుల సునీత యాదయ్య, ఆవుల సుందర్, బొంతల చంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

