CM Revanth | భూభారతి కాదు ..భూ… హారతి

CM Revanth | భూభారతి కాదు ..భూ… హారతి
రైతులకు ఇచ్చిన నోటీసులు వెనకకు తీసుకోవాలి
కమిషన్లు దంచుడు… పేదలకు ఎగ్గొట్టుడు
కెసిఆర్ నాట్లకు వేస్తే రేవంతు ఓట్లకు వేస్తున్నాడు
వెంటనే సాదా బహినామ అమలు చేయాలి
నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో నమోదు చేయాలి
మోటార్ సైకిల్ మీద పదివేల రూపాయల ట్యాక్స్ పెంచిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆస్తులు పెరిగాయే తప్ప పేదల బతుకులు మారలేదు
మాజీ మంత్రి టిఆర్ఎస్ డిప్యూటీ ఫోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు
CM Revanth | జనగామ, ఆంధ్రప్రభ : రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు పెరిగాయే తప్ప రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు మారలేదని, ధరణి పేరు మార్చి భూభారతితో భూ బకాసురులుగా మారారని, భూభారతిలో జరిగిన అవినీతిపై సిట్ వేసి విచారణ జరపాలని మాజీ మంత్రి టిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.
భూముల రిజిస్ట్రేషన్ కోసం భూమారతి సైట్లో పొందపరచిన సాఫ్ట్వేర్ ను ఉన్నతాధికారుల లాగిన్ లో ఉండవలసిన సాఫ్ట్వేర్ ఆపరేటర్ల చేతులకు ఎలా వచ్చిందని, అధికారులు ఇటు ప్రభుత్వం కుమ్మక్కై రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించవలసిన డబ్బులలో 10% మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి మిగత 90% అమౌంట్ ను అవినీతి పరుల చేతిలోకి వెళుతున్న పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా భూ బకాసురులుగా మారిన ప్రభుత్వ అధికారులపై వెంటనే విచారణ చేపట్టి అవి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి, జనగామతో సహా 8 జిల్లాలలో 48 మంది భూభారతి సైట్ దొంగలను పట్టుకొని శిక్షించేది పోయి 15 మంది పై నామమాత్రపు కేసు వేసి అధికారులను తప్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఇందుకుగా భూభారతిలో జరిగిన అవినీతిపై సీటు వేసి విచారణ జరిపి వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
CM Revanth | రైతుబంధు కెసిఆర్ నాట్లకు వేస్తే.. రేవంత్ ఓట్లకు వేస్తున్నాడు…
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో భాగంగా రైతు భరోసాను ఎగ నామం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని , అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే వరి నాట్లు పడే సమయానికి కేసీఆర్ రైతు ఖాతాలో రైతుబంధువేసి రైతులకు అవసరగా నిలబడ్డాడని, రేవంత్ రెడ్డి అయితే ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసాని రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడని అన్నారు.
CM Revanth | సాదా బహినామా అమలు చేయాలి…
రాష్ట్రంలో వేల మంది సాదా బైనమా పై సొంత పట్టాదారులుగా మార్చిన ఘనత కేసిఆర్ కు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సాదా బైనామా అప్లికేషన్లు తీసుకుని పెండింగ్లో పెట్టడం సబబు కాదని , వేలమంది రైతులు సాదా బైనమా రాసుకుని ఉన్నారని వాటిని వెంటనే పరిష్కరించి రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేల ఎకరాల నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో నమోదు చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వెంటనే నిషేధిత భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు.
నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు ప్రాజెక్టులు అతి తక్కువ నీటిని వినియోగం చేస్తుందని ఈ రాష్ట్రంలో మన నీళ్లు మనం దక్కించుకోవడంలో ఉత్తంకుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సాగర్ శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నీళ్లను తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కనులుప్పగించి చూస్తుందని ఎద్దేవ చేశారు. అలాగే రాజీవ్ యువ వికాసం ఆత్మీయ భరోసా, ఉద్యోగ కల్పన ఒంటి హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కృష్ణ నది జలాల వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగిందని వాటిని దక్కించుకోవడంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
భూభారతిలో జరిగిన కుంభకోణాల్లో సిట్ వేసి మొత్తం పూర్వపరాలు బయటకు తీయాలని దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని విడుదల చేయని యెడల రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై గట్టిగా నిలదీస్తామని అన్నారు. తప్పు అధికారుల ది అయితే రైతులకు నోటీసులు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. డబ్బులు ఎవరు తిన్నారు వారిని చెల్లించమని పోయేది విడిచి పూర్తి డబ్బులు చెల్లించాలని రైతులకు నోటీసులు అందించడం సిగ్గుచేటని అన్నారు.
CM Revanth | రేవంత్ ఆస్తులు పెరిగాయి తప్ప పేదల బతుకులు మారలేదు…
రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు పెరుగుతుంటే పేదల బతుకులు మరింత దిగజారుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి భూపకాసురులుగా మారిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు తాళ్ల సురేష్ రెడ్డి, నాయకులు బాల్దె సిద్దిలింగం, ఇర్రి రమణారెడ్డి, భూష పర్వతాలు, పెద్దిరాజి రెడ్డి, పల్లా సుందర్ రాం రెడ్డి, గద్దల నర్సింగావు, ఎడవెల్లి కృష్ణారెడ్డి, గాంధీ నాయక్, సువార్త, మామిడాల రజిత, వెన్నెల, సేవేల్లి మధు రామ్మోహన్ రెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, మల్లిగారి రాజు, పసుల ఏబేలు, చింతకింది సురేష్, ఖమర్, ఆఫీజ్ ఫాతిమా, గంగరబోయిన అనిత మల్లేశం, కొండి వెంకటరెడ్డి, సేవెల్లి సంపత్, రాజీవ్ రెడ్డి, రావెల రవి, సజ్జ దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.