AP | సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం.. ఎంపీ బైరెడ్డి శబరి

కర్నూలు బ్యూరో : పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. గురువారం ఎంపీ బైరెడ్డి శబరి కర్నూలు కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… సీఎం రిలీఫ్ ఫండ్ భాదితులకు వెంటనే మంజూరు చేసి దైర్యం అందిస్తూ, ఆర్ధిక భరోసా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రంలో ఆర్ధిక కష్టాలున్నా పేద రోగులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ముందుంటున్నారని ఎంపీ శబరి అన్నారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడుకు చెందిన బాధితుడు గటిక రాంప్రసాద్ రెడ్డికి రూ.2,15,300లు, పాణ్యం నియోజకవర్గం లక్ష్మిపురంపేటకు చెందిన పి.సాయి ప్రియకు రూ.56,273 లు, ఆళ్లగడ్డకు చెందిన పి.చిన్న దస్తగిరికి రూ.79,502లు, బనగానపల్లెకు చెందిన కె.జయంతి కి రూ.23,400 లు, కొత్తపల్లికి చెందిన గజ్జల వెంకట లక్ష్మికి రూ.50,431లు, కానాలకు చెందిన ముక్కు తిరుపతిరెడ్డికి రూ.81,000 లు, బండి ఆత్మకూరుకు చెందిన పిట్టం వెంకట సుబ్బమ్మకు రూ. 75,090లు, నంద్యాల బొమ్మలసత్రంకు చెందిన సోమ జయమ్మకు రూ.25,227 లు, కర్నూలు వద్ద దొర్నిపాడుకు చెందిన జి.నాగేంద్రకు రూ.30,000 లు ఇలా మొత్తం రూ.6,36,223ల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఎంపీ డా.బైరెడ్డి శబరి అందజేశారు. తన లెటర్ ద్వారా పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు వెంటనే విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *