సీఎం సాయం..

సీఎం సాయం..
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన వీరమల్ల సాయికుమార్ అనారోగ్యానికి గురై ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పథకం ద్వారా సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో రూ.1లక్ష మంజూరు అయ్యింది. ఎమ్మెల్యే ఆదేశాల మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బాధితులు సాయి కుమార్, మొగిలికి రూ.1 లక్ష విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు భాషబోయిన పాపయ్య, మాజీ సర్పంచ్ భాషబోయిన రవి, మాజీ ఉప సర్పంచ్ భాషబోయిన శ్రీను, నాయకులు ఏడేళ్ళి రాజిరెడ్డి, పెద్ది మైపాల్ రెడ్డి, భూషబోయిన కోటి, సల్పాల శ్రీను, ఎగ్గె రమేష్, భాషబోయిన రాజాలు, సింగబోయిన రాజు, పాక రాజు తదితరులు పాల్గొన్నారు.
