CM FUND | పేదలకు ఆర్ధిక భరోసా..
- సీఎం సహాయనిధితో తోడ్పాటు
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
CM FUND | ఆంధ్రప్రభ, మైలవరం : సీఎం సహాయనిధితో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. మైలవరం పట్టణంలోని శాసనసభ్యుని కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్ఓసీలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఈ రోజు అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాజాగా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు1485 మందికి రూ.12.29 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేసినట్లు వెల్లడించారు.

తాజాగా నియోజకవర్గంలో 79 మందికి రూ.87 లక్షల సీఎంఆర్ఎఫ్ మంజూరు అయినట్లు వెల్లడించారు. వీటిలో 38 మందికి రూ.21.20 లక్షలు రీ ఎంబర్స్ మెంట్ చెక్కులు కాగా, 41 మందికి రూ.65.80 లక్షలు ఎల్.ఓ.సీల రూపంలో మంజూరు అయినట్లు వివరించారు. మైలవరం మండల పరిధిలో 12 మందికి రూ.5.60 లక్షలు తాజాగా మంజూరు అయినట్లు స్పష్టం చేశారు. వీటిని సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.



