ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యంగా గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7వ తేదీన శంకుసఫాన చేయనున్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో ఈ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.98 కోట్లు మంజూరు చేశారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఓవర్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని తలపెట్టారు.