AP | తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ..

తిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) రాత్రి తిరుమల చేరుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలేశుని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు

ముందుగా వారి కుటుంబ సభ్యులు తిరుమలకు చేరుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి కారులో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు ఘన స్వాగతం పలికారు.

రాత్రి తిరుమలలోనే బస చేయనున్న చంద్రబాబు.. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలేశుని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద సముదాయంలో మనవడు దేవాన్ష్‌ పేరు మీద ఒక రోజు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడానికి రూ.44 లక్షలు టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నారు.

తరువాత కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం వడ్డించి.. అక్కడే భోజనం చేస్తారు. ఆ తర్వాత కారులో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *