- లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ
లండన్, ఆంధ్రప్రభ : లండన్‌లోని పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌లో రోల్స్ రాయస్ సంస్థ సీటీఓ నిక్కీ గ్రేడి స్మిత్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులో మిలిటరీ ఎయిర్‌స్ట్రిప్, విమానాల ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటు అవకాశాలను వివరించారు.
అదేవిధంగా SRAM-MRAM గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయలతో కూడా సీఎం సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.





