CM Chandrababu | కేంద్ర జల్‌శక్తి మంత్రితో చంద్రబాబు భేటీ

CM Chandrababu | కేంద్ర జల్‌శక్తి మంత్రితో చంద్రబాబు భేటీ
CM Chandrababu | ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Patil) తో సీఎం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు వివరంగా చర్చించినట్లు సమాచారం. కేంద్ర సహకారం, నిధుల విడుదల వంటి విషయాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar), రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తో పాటు పలువురు ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత సహకారం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
