ఆలేరులో ఆలయాల మూసివేత..

ఆలేరులో ఆలయాల మూసివేత..

ఆలేరు, ఆంధ్రప్రభ : కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని పలు ప్రధాన ఆలయాలను మంగళవారం మూసివేశారు. ఆలేరు, కొలనుపాక, రాఘవాపురం, గొలనుకొండ, శర్బనాపురం, టంగుటూరు, శారాజిపేట, తూర్పు గూడెం, మంతపురి గ్రామాలలో ఉన్న ఆలయాలను పూజలు జరిపి ఉదయమే మూశారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత సంప్రోక్షణ పూజలు జరిపి తిరిగి ఆలయాలు తెరుస్తామని అర్చకులు తెలిపారు.

Leave a Reply