Civil Rights Day | ఎస్సి ఎస్టీ జిల్లా కమిటీ సభ్యులుగా….

Civil Rights Day | ఎస్సి ఎస్టీ జిల్లా కమిటీ సభ్యులుగా….
Civil Rights Day | దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా ఎస్సి ఎస్టీ డివి ఏంసి జిల్లా కమిటీ సభ్యులుగా దమ్మా. నారాయణకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సి ఎస్టీ లకు రావాల్సిన నిధులు, అట్రాసిటీ కేసుల ఫిర్యాదులు, భూసమస్యలు, వంటి కార్యక్రమాలు కమిటీ సభ్యులతో పరిష్కరిస్తామని అన్నారు, ప్రతినెల సివిల్స్ రైట్స్ డే(Civil Rights Day) కార్యక్రమన్ని నిర్వహించి ప్రజల్లో చట్టలపై అవగహన కల్పించాలని అధికారులతో మాట్లాడారు.
అనంతరం ఎస్సి ఎస్టీ జిల్లా కమిటీ సభ్యులుగా నియమితులైన నారాయణ కు దండేపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో శాలువతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో,తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపిడిఓ జాగర్లమూడి ప్రసాద్, అల్ ఇండియా అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి. రవికుమార్, సంఘ మార్గ నిర్దేశకులు అక్కల. సురేష్, కిషన్ గౌడ్, మునిమడుగు.గంగన్న, దుర్గం. రాము తదితరులు పాల్గొన్నారు.
