టెక్నాలజీ రంగంలో దిగ్గజం అయిన సిస్కో, తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి నైపుణ్య శిక్షణను అందించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధన్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.
నైపుణ్య శిక్షణ అందించే విషయంలో ఈ సందర్బంగా సిస్కోకు స్కిల్స్ యూనివర్సిటీకి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ #TASK కు మధ్య వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో స్కిల్స్ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు గారు, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా పాల్గొన్నారు.