Circle Inspector | బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ

Circle Inspector | బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ

మంత్రాలయం నూతన ఎస్ఐగా మల్లికార్జున

Circle Inspector | మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎస్‌. మల్లికార్జున బాధ్యతలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రాలయం సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ పి. రామానుజులుని మర్యాద పూర్వకంగా క‌లిశారు. మంత్రాలయంలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా శాంతి భద్రతలను కాపాడాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైకి సూచించారు. అలాగే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం నిమిత్తం మంత్రాలయంకు వ‌చ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ట్రాఫిక్ సమస్య త‌లెత్త‌కుండా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ఉన్న చెడు నడత గలవారిని గుర్తించి వారికి ముందస్తుగా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగులు చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి సూచనలు ఇవ్వడమైనది.

Leave a Reply