CII | ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా తెలంగాణ – డిప్యూటీ సీఎం భ‌ట్టి

హైద‌రాబాద్ – ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం రోజురోజుకు శర వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(deputy cm bhatti vikramark ) అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ లోని కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII ) ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ (CEO ) సదస్సు (conference ) లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, . ఔటర్ రింగ్ రోడ్డు ఫలితాలను మనం చూసామ‌ని అంటూ సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy ) నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డును (regional ring road ) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఫార్మా, ఐటీ కంపెనీలతోపాటు హౌసింగ్, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక రకాల పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు.

హైదరాబాద్ కు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. లండన్ లోనీ థేమ్స్ నది మాదిరిగా హైదరాబాద్ నగరంలో మూసి నదిని పారించేందుకు మూసి పునర్జీవనం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ పట్టణం, తెలంగాణ రాష్ట్రం స్వర్గ ధామం లాంటిదని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న కార్మికులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తార‌ని, , చక్కటి వాతావరణం, కాలుష్య రహితం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు.

నైపుణ్యం ఉన్న మానవ వనరులను సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని 100 ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉన్నాయి త్వరలో ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ గా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలకం రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి కల్పన, సంపద సృష్టికి పారిశ్రామికవేత్తల సలహాలు సూచనలు స్వీకరించి అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తమ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తుంద‌న్నారు. కలిసి సాగుదాం రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చూడదామని తెలిపారు.

పారిశ్రామికవేత్తలు సిఎస్ ఆర్ నిధులను పాఠశాలలు, నాలెడ్జ్ సెంటర్ల కోసమే కాకుండా రైతులు, మహిళల ప్రగతి కోసం కూడా ఖర్చు చేయాలని డి భట్టి విక్రమార్క సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐఐ నిర్వాహకులు శేఖర్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, ఎంవి నరసింహం, గౌతమ్ రెడ్డి, సమీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply