Christmas | రక్షకుడు ఏసుక్రీస్తు – మంత్రి కొల్లు రవీంద్ర

Christmas | రక్షకుడు ఏసుక్రీస్తు – మంత్రి కొల్లు రవీంద్ర

Christmas |కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : సర్వ మానవాళి రక్షకుడు ఏసుక్రీస్తు అని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ సమీపంలోని హైని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కటింగ్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు రక్షకుడిగా జన్మించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ సమిష్టిగా ఈ పండుగ వేడుకలు నిర్వహించుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లకు గౌరవ వేతనం అందజేసిందని తెలిపారు. చర్చలకు కావలసిన ఆర్థిక సాయం అందజేయడంతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. పండుగ వేడుకలను కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో కలిసి ఘనంగా ప్రార్ధన మందిరాల్లో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply