Christmas 2025 | ఐక్య క్రిస్మస్..

Christmas 2025 | ఐక్య క్రిస్మస్..

Christmas 2025, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో మాదిగ ఉద్యోగులు, బంధువులు ఉపకులాల ఆధ్వర్యంలో 16వ ఐక్య క్రిస్మస్ ఉత్సవ మిలాప్ 2025 వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్, గుడివాడ పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, ఏపీ ఎస్డబ్ల్యుసీ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా నాయకులకు నిర్వాహకులు తీన్మార్ డప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంఘ పెద్దలతో కలిసి జవహర్, ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్ చేస్తూ, సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ మాట్లాడుతూ.. అందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుడివాడలో ఘనంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల చదువుల పై తల్లిదండ్రులు దృష్టి పెట్టి, వారి బంగారు భవితకు బాటలు వేయాలని కోరారు.

ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. ప్రేమను పంచుతూ మనకున్న దాంట్లో పొరుగు వారికి సాయం చేయడమే క్రిస్మస్ నిర్వచనం అన్నారు. భగవంతుని కృప, ఆశీర్వాదాలు ప్రజలందరి పై ఉండాలని భగవంతుని ముందు తామంతా నిమిత్త మాతృలమేననీ చెప్పారు. పరిశుద్ధ గ్రంథం చూపిన మార్గంలో పయనించే వారే నిజమైన క్రైస్తవుడని, వారి మనసుల్లో క్రీస్తు ఉంటాడని కుమార్ రాజా అన్నారు. దేవుడైన క్రీస్తు దయ, కరుణ, దీవెనలు ప్రజలందరి పై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ ముందే వచ్చిందా అన్నట్లు నేడు జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గుడివాడలో ఎప్పుడూ చూడని అభివృద్ధి మనం చూస్తున్నామంటే.. అది దేవదేవుడి దీవెనల ఫలితమేనన్నారు. అనుదినం ప్రార్థనలు చేసే క్రైస్తవ సోదరులు గుడివాడ అభివృద్ధికి ఒక నిమిషం కేటాయించాలనీ విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా దేవుడు నుండి తాను ఏమీ కోరుకోనని, ప్రజలకు మంచి భవిష్యత్తు, గుడివాడ మార్పు చెందాలనే భగవంతున్నీ ప్రార్థిస్తానని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు.

వేడుకల్లో భాగంగా క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, క్రీస్తు సందేశాన్ని వినిపించారు. వేడుకల్లో భాగంగా జవహర్, ఎమ్మెల్యేలు కుమార్ రాజా, రాము, అతిథులు పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసారు. వేడుకల్లో పాల్గొన్న నాయకులు, అతిథులను నిర్వాహకులు ఆత్మీయ సత్కారం చేశారు.

సెమీ క్రిస్మస్ వేడుకల్లో CBCNC రాష్ట్ర కన్వీనర్ ఉప్పలపాటి ఆశీర్వాదం, ఉత్సవ మిలాప్ పెద్దలు కంచర్ల సుధాకర్, కొదమల గంగాధర్, కే జేవిక్టర్ పాల్, కంచర్ల సుధాకర్, ఉప్పల మాణిక్యాలరావు, కొడాలి బాలు, అద్దంకి మాణిక్యాలరావు, ఇంటూరి గజేంద్ర, బసలాది షేకర్, కలపాల కార్తీక్, నీరంజన్, పమ్మిడి ముక్కల వంశీ, కంచర్ల సునీల్, ఆకారపు రాజేష్, మహేష్, కలపాల బాబురావు, అప్పికట్ల ఆడం స్మిత్, కందుల రాజు, జయరాజు, బావసాని యోహాను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply