చౌటుప్పల్ గురుకులం తనిఖీ

యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : చౌటుప్పల్ బాలికల గురుకుల పాఠశాల(School)ను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) భాస్కర్ రావ్ ఆకస్మికంగా ఈ రోజు తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పాఠ‌శాల‌కు రాలేదు. కలెక్టరేట్‌(Collectorate)లో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ఉన్నదని గురుకుల పాఠశాలకు రాలేదు అని తెలుసుకుని మండిపడ్డారు. మధ్యాహ్నం మీటింగ్ (meeting) అయితే విధులకు రాకపోవడం ఏమిటని…? ఆయ‌న‌కు మెమో ఇవ్వాలని సూచించారు. వంట గదిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలని అదనపు కలెక్టర్ (additional collector) ఆదేశించారు. పిల్లల పట్ల అశ్రద్ధ చూపొద్దని, మెనూ (Menu) ప్రకారం భోజ‌నం పెట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అన్నారు.

Leave a Reply