Choutuppal | ప్రజలే తగిన గుణ పాఠం చెప్తారు

Choutuppal | ప్రజలే తగిన గుణ పాఠం చెప్తారు

  • మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

Choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం పట్ల కూసుకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ పార్టీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్‌పై విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం అమానుషమన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తోంన్నారు. అక్రమ కేసులు, నోటీసులతో బీఆర్ఎస్ గొంతు నొక్కలేరని, ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతారని కూసుకుంట్ల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలం పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, పార్టీ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశం, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, మాజీ జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఎం దయాకరాచారి, నాయకులు సుర్కంటి శంకర్ రెడ్డి, చింతల మైపాల్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply