Choutuppal | సాగు, త్రాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యం

Choutuppal | సాగు, త్రాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యం

  • ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తా
  • రూ. 2 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యలతో పాటు నియోజకవర్గంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, రోడ్లు, డ్రైనేజీలు తదితర అన్ని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నట్లుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలోని ఫిలాయపల్లి కాల్వ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద ఆయకట్టుకు సాగునీరు స్థిరీకరణ కోసం చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం పరిధిలోని లొద్దికుంట, గంగదేవికుంటలకు మూసి నీటిని తరలించడానికి దివిస్ పరిశ్రమ యాజమాన్యం సహకారంతో రూ. 1.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో రూ. 88 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శనివారం దివిస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్ తో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని 7 మండలాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు కూడా అండగా ఉండాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఫిషరీస్ జిల్లా చైర్మన్ పాశం సంజయ్ బాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సర్పంచులు భీమిడి ప్రదీప్ జీ, గంగాపురం వసంత నగేష్ గౌడ్, తీగుళ్ల చంద్రయ్య, గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్, గంజి వనజా కృష్ణ, రిక్కల మహేందర్ రెడ్డి, ముస్కు అంజిరెడ్డి, మాజీ సర్పంచులు గుండు మల్లయ్య గౌడ్, చింతపల్లి వెంకట్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, నాయకులు ఉప్పు భద్రయ్య, కొయ్యడ సైదులు, మొగుదాల రమేష్, బత్తుల విప్లవ్, కంచరకుంట్ల రామ్ రెడ్డి, దుబ్బాక ఆకాష్ రెడ్డి, ఊడుగు శ్రీనివాస్, ఊడుగు రమేష్, పస్తం గంగారాములు, దివిస్ అధికారులు బి కిషోర్ కుమార్, బి గోపి తో పాటు విద్యుత్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply