ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ సంబరాలు..

ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ సంబరాలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, కల్పన, లఆధ్వర్యంలో సైన్స్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రంగోలి, చిత్రలేఖనం, క్విజ్,వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే తయారు చేయబడిన వివిధ సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శింపజేశారు. అనంతరం, ఏర్పాటుచేసిన సమావేశంలో సివి రామన్ గొప్పదనం గురించి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కోడెపాక రఘుపతి పాల్గొని మాట్లాడుతూ ఒక దేశ అభివృద్ధి సైన్స్ విజ్ఞానం పై ఆధారపడి ఉంటుందని, విద్యార్థిని విద్యార్థులు సైన్స్ యందు ఆసక్తిని పెంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, నీలిమారెడ్డి, బుర్ర. సదయ్య,రామ్ నారాయణ, ఉస్మాన్ అలీ, శంకర్, సుజాత, బుజ్జమ్మ, రవీందర్, గోపగాని భాస్కర్.చెట్టి భాస్కర్. వందన.వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply