ప్రారంభించిన చిత్తూరు ఎంపీ
చిత్తూరు, చిత్తూరు బ్యూరో : పేదలకు కార్పొరేట్ వైద్య నిపుణుల ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం జరిగిందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు (MP Daggumalla Prasad Rao) అన్నారు. శనివారం చిత్తూరు పట్టణం పి వి కే ఎన్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని చిత్తూరు ఎంపీ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆముద, చూడా చైర్మన్ కటారి హేమలత, నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఆర్డీవో శ్రీనివాసులు, డిఆర్డిఏ పిడి శ్రీదేవి, జడ్పీసీఈవోరవికుమార్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… చిత్తూరు (Chittoor) పట్టణంలో జిల్లా యంత్రాంగం కృషితో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్థితిలో లేని పేద వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. శిబిరంలో రెయిన్ బో, ఐ ఫౌండేషన్, అరవింద్ ఐ ఆసుపత్రుల లాంటి కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు ద్వారా వైద్యం అందించడంతో పాటు మందులు, కళ్ళ అద్దాలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాల్లో ఆర్థోపెడీషియన్, న్యూరాలజిస్ట్ లు, ల్యాబ్ డయోగ్నసిస్ట్ లు, గైనకాలజిస్ట్ లు, కంటికి సంబంధించిన వైద్యులు, జనరల్ మెడిసిన్ వైద్యులు, కార్డియాలజిస్ట్ లు, ఈసీజీ, అల్ట్రా సౌండ్ టెక్నీషియన్ లు పాల్గొన్నారన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వైద్య శిబిరం (Medical camp) ద్వారా బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుండి వచ్చిన కార్పోరేట్ వైద్య నిపుణుల ద్వారా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరం ఏర్పాటులో జిల్లా యంత్రాంగం నుండి డి ఎం అండ్ హెచ్ ఓ, డి ఆర్ డి ఏ, డ్వామా పి డి లు, చిత్తూరు ఆర్డిఓ లు కృషి చేశారన్నారు. చిత్తూరు పట్టణం పరిసరాల ప్రాంతాల నుండి సుమారు 4 వేల మంది ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని ఆశిస్తున్నామన్నారు.
కార్పోరేట్ వైద్య నిపుణుల (Corporate medical professionals) ద్వారా గుండె, నరాలు, కంటి సమస్యలతో పాటు బి పి, షుగర్ లాంటి సమస్యలకు ఉచిత వైద్యం అందించడం తో పాటు ఉచితంగా మందుల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలు 3 లేదా 6 నెలలకు ఒక సారి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో, సుధారాణి, డి సి హెచ్ ఎస్ పద్మాంజలి, మున్సిపల్ కమిషనర్, నరసింహ ప్రసాద్, ఇతర వైద్య సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.