ప్రారంభించిన చిత్తూరు కలెక్టర్..

  • లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవలు జరగాలని, జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. బుధవారం జిల్లా సచివాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను ల‌యన్స్ క్లబ్ గవర్నర్ అశ్వత నారాయణ, దాత సీవీ భానుమూర్తిరెడ్డి లతో కలసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కె.మోహన్ కుమార్, ఏఓ వాసుదేవన్, లయన్స్ క్లబ్ చైర్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… లయన్స్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదే విధంగా కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.7 లక్షల విలువ గల ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

జిల్లా సచివాలయానికి ప్రతి సోమవారం సుమారు 300 నుండి 400 మంది అర్జీ దారులు సుదూర ప్రాంతాల నుండి వస్తారని, వీరికి ఈ ఆర్ఓ ప్లాంట్ ద్వారా ఉచితంగా మంచి నీటి సరఫరా ఇవ్వగలమన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఆర్ఓ ప్లాంట్ ను నిర్వహించడానికి, శుభ్రం చేయడానికి, ఇతర అవసరాల కోసం సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలకు ఉచితంగా, పెద్దవారికి నామమాత్రపు ఖర్చు తో కంటి పరీక్షలు, కళ్లజోళ్ళు పంపిణీకి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరగా తప్పక సహకారం అందిస్తామని, ప్రభుత్వం తరఫున దాదాపు 3000 మంది అర్హుల జాబితాను సైతం అందించడం జరుగుతుందన్నారు.

ఆర్ఓ ప్లాంట్ దాత సివి భానుమూర్తి మాట్లాడుతూ.. జిల్లా సచివాలయంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు కోరిన వెంటనే స్థలం కేటాయించినందుకు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహణకు ఒక లక్ష రూపాయలు లయన్స్ క్లబ్ ట్రస్ట్ కు అందించారు. కణ్ణన్ కళాశాల, పిసిఆర్ కళాశాలలో ఆర్ ఓ yప్లాంట్ లను ఏర్పాటు చేయాలని కోరారు.

Leave a Reply