మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ “విశ్వంభర” నుండి మేకర్స్ మెగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. బింబిసార ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ ఒక విజువల్ వండర్ గా ప్రేక్షకులను అలరించబోతోందని గ్లింప్స్ స్పష్టంగా చూపిస్తోంది.

దర్శకుడు వశిష్ట, చిరంజీవిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ ఐకానిక్ లుక్లో ప్రదర్శిస్తానని హామీ ఇవ్వగా, ఇప్పటి వరకు వచ్చిన లుక్స్, పాటలు, టీజర్‌లు అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆ క్రేజ్‌ను పదింతలు పెంచేసింది. ముఖ్యంగా 14 లోకాల మూలం అయిన బ్రహ్మదేవుడి సత్యలోకంను అద్భుతమైన విజువల్స్‌తో చూపించడం ఆకట్టుకునే అంశం.

చిరు స‌ర‌స‌న సౌత్ కా క్వీన్..

ఈ చిత్రంలో చిరంజీవి సరసన సౌత్ కా క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, నా సామిరంగ ఫేమ్ ఆషికా రంగనాత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కునాల్ కపూర్ విలన్‌గా, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్‌తో మెప్పించబోతున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక‌ తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో, “విశ్వంభర” సమ్మర్ 2026లో రిలీజ్ కానుందని అధికారికంగా కన్‌ఫామ్ చేశారు మేక‌ర్స్.

Leave a Reply