Chiru – Pawan | క్రేజీ మల్టీస్టారర్ డైరెక్టర్ ఎవరు…?

Chiru – Pawan | క్రేజీ మల్టీస్టారర్ డైరెక్టర్ ఎవరు…?

Chiru – Pawan | మళ్లీ ఊపందుకున్న మల్టీస్టారర్ ట్రెండ్
మెగా బ్రదర్స్ కలిసి వస్తే ఎలా ఉంటుంది?
ఎవరు ప్లాన్ చేస్తున్న మెగా మల్టీస్టారర్?
థియేటర్స్‌లో పూనకాలేనా?
మెగా ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఆసక్తి

Chiru – Pawan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు.. కాలంలో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఆతర్వాత చిరు, బాలయ్య, నాగ్, వెంకటేష్‌.. ల కాలంలో వీళ్లు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఇద్దరు హీరోలు కలసి సినిమాలో నటిస్తే.. ఆ ఇద్దరు హీరోల అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు మెగా మల్టీస్టారర్ రెడీ అవుతోందని ఓ వార్త ఇండస్ట్రీ జనాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ.. మెగా మల్టీస్టారర్ ఏంటి..? ఈ క్రేజీ మూవీని ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ ఎవరు..?

Chiru – Pawan | మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్..

Chiru - Pawan

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్‌, మహేష్‌ బాబు కలసి నటించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అప్పటి నుంచి మళ్లీ మల్టీస్టారర్ చిత్రాల్లో ఊపొచ్చింది. గోపాల గోపాల, మనం, ఆర్ఆర్ఆర్… ఇలా క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు మెగా మల్టీస్టారర్ రెడీ అవుతుందనే వార్త మెగా ఫ్యాన్స్ లో మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ లో సైతం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ.. మెగా మల్టీస్టారర్ లో నటించే హీరోలు ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌ కలిసి నటిస్తే.. మెగా హీరోలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.

Chiru – Pawan | థియేటర్స్ లో పూనకాలే..

Chiru - Pawan

అయితే.. ఈ క్రేజీ, మెగా మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తుంది ఎవరనేది బయటకు రాలేదు కానీ.. మెగాస్టార్ కు సన్నిహితంగా ఉండే.. ఓ ప్రముఖ డైరెక్టర్ అని మాత్రం వినిపిస్తుంది. కథలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటూ ఎమోషన్స్, యాక్షన్, ఫ్యాన్స్ కోరుకునే అంశాలు జోడించి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ కథను చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తోంది.

Chiru - Pawan

అయితే.. మెగా బ్రదర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. శంక‌ర్ దాదా జిందాబాద్ మూవీలో ప‌వ‌న్ కళ్యాణ్‌ గెస్ట్ రోల్ కనిపించారు. పవర్ స్టార్ కొన్ని నిమిషాలే కనిపించారు. అయినప్పటికీ.. అప్పట్లో థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక చిరు, పవన్ కలిసి సినిమా చేస్తే.. థియేటర్స్ లో పూనకాలే. మరి.. ఈ క్రేజీ మల్టీస్టారర్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply