మ‌రో రెండు కొత్త ప్రాజెక్టుల‌తో చిరు బిజీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : మెగాస్టార్​ చిరంజీవి (Megastar Chiranjeevi)కి టాలీవుడ్‌(Tollywood)లో ఉన్న‌క్రేజీ అంతాఇంత కాదు. ఆయ‌న వ‌రుస సినిమాల‌ను చేస్తూ దూసుకుపోతున్నారు. 70 ఏళ్ల వ‌య‌సులో యంగ్ హీరోల‌కు దీటుగా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్​ దశలో ఉండగా, మరో రెండు చిత్రాలు లైన్​లో పెట్టారు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. భారీ బడ్జెట్​తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్​ చిరంజీవి- అనిల్​ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్​లో తెరకెక్కుతున్న మ‌రో సినిమా మన శంకర వరప్రసాద్​గారు (Mana Shankara Varaprasad). పండగకు వస్తున్నారు అనేది క్యాప్షన్. ఈ రెండు సినిమాలు కాకుండా చిరంజీవి మ‌రో రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు. ఇందులో ఒక‌టి డైరెక్టర్​ శ్రీకాంత్ ఓదెల(Director Srikanth Odela)తో సినిమా కన్ఫార్మ్ అవ్వగా, తాజాగా బాబీతో సినిమా ఖరారైంది. టాలీవుడ్​(Tollywood)లో సీనియర్ హీరోల్లో ఎవరు కూడా ఇన్ని సినిమాలు లైన్​లో పెట్టలేదు. దీంతో చిరు ఫ్యాన్స్​(Chiru Fans)లో క్రేజ్​ మరింత పెరిగిపోయింది.

ఓదెలతో సినిమా…
నానితో ప్రస్తుతం శ్రీకాంత్​ ఓదెల సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫుల్​ వైలెంట్​గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్​ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే చిరంజీవితో త్వరలోనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. దాని గురించి ప్రేక్షకులలో హైప్​ పెంచేందుకు అప్పట్లో ఓ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. ఒక ఫ్యాన్​ చిరంజీవిని తెరపై ఎలా చూడాలని అనుకుంటాడో అదే విధంగా మెగాస్టార్​ను స్క్రీన్​పై చూపిస్తానంటూ రీసెంట్​గా పోస్ట్ చేశారు. నాని సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్​​ పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

బాబితో సినిమా… కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌
ఇవన్నీ ఇలా ఉండగా రీసెంట్​గా డైరెక్ట‌ర్ బాబీ (Director Bobby)కూడా చిరుతో సినిమా అనౌన్స్ చేశారు. ఇది మెగా 158గా తెరకెక్కనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ సినిమా(Poster Movie) పై భారీ హైప్స్​ను పెంచేసింది. ఫుల్​ వైలెంట్​గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్​డేట్స్​ త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply