Chintal cheruvu | అవకాశం ఇవ్వండి – అభివృద్ధి చేసి చూపుతా!
- నా స్వగ్రామ రూపురేఖలు మార్చుతా
చింతల్ చెరువు సర్పంచ్ అభ్యర్థిని మమత శివకుమార్
Chintal cheruvu | ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : తనకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపుతామని చింతల్ చెరువు సర్పంచ్ అభ్యర్థిణి మమత శివశంకర్ (Mamatha Sivashankar) అన్నారు. తన భర్త శివకుమార్ ప్రోత్సహంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నానని, తన భర్త నిత్యం గ్రామ అభివృద్ధి కోసం తపిస్తారని, అధికారం లేకున్నా గ్రామానికి తన వంతుగా బాధ్యతాయుతంగా ఎంతో చేశారని, అవకాశం ఇస్తే చింతల్ చెరువును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మమత శివశంకర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధి హత్నూర మండలం చింతల్ చెరువులో మమత శివకుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

అభివృద్ధిపై ప్రత్యేక విజన్ : సర్పంచ్ అభ్యర్థిణి మమత (ఫోటో -1)
గ్రామంలో పూర్వ పాలకులు అభివృద్దిని పట్టించుకోలేదని సర్పంచ్ అభ్యర్థణి మమత శివకుమార్ తెలిపారు. తనదైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే తమ అభిమతమని అన్నారు. అదే పంథాతో ప్రచారం నిర్వహిస్తు ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తమ మేనిఫెస్టో (24 అంశాలు) విడుదల చేశామని, తమ విజన్ ను గ్రామస్థుల ముందు ఉంచామని అన్నారు.

ఇవే మా ప్రధాన వాగ్దానాలు…
గ్రామంలో మౌలిక సదుపాయల కల్పనతోపాటు ప్రధాన హామీలు ఇచ్చినట్లు చింతల్ చెరువు సర్పంచ్ అభ్యర్థిణి మమత శివశంకర్ తెలిపారు.
- ప్రతి వార్డులో వీధి దీపాలు ఏర్పాటు, నింరతం తాగునీరు, పారిశుధ్యం మెరుగుకు కృషి
- తాను పదవిలో ఉన్నంత కాలం ఐదేళ్లు గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి రూ.5000 ఫిక్స్ డ్ డిపాజిట్ చేయిస్తా. (పెళ్లిళ్ల నాటికి అమ్మాయికి హితిధికంగా డబ్బు సహాయం పడుతుంది)
- గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, గ్రామానికి చెందిన యువతకు పలు కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పన, సీసీపీఎల్‌తో గ్రామంలో క్రీడలు, ఆటల షెడ్యూల్, వృద్ధులకు ప్రత్యేక స్థలం, పాఠశాలకు కొత్త భవనం, గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు, గ్రామంలో ఒక మంచి పరిశ్రమ ఏర్పాటు, చెరువుచుట్టు వాకింగ్ ట్రాక్, ఎవరైనా చనిపోతే బంధువులు వచ్చే వరకూ పార్థివదేహం ఉంచడానికి ఒక ఐస్ బాక్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వీటితోపాటు మరిన్ని హామీలు ఇవ్వనున్నట్లు చెప్పారు.


