చిన లింగాయపాలెం కన్నీరు మున్నీరు

గుంటూరు జిల్లాలో కలకలం
చలించిన డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రభ, కాకుమాను (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా(Guntur District)లోని ఓ పచ్చని ఊరు గొల్లుమంది. జనం బావురు మన్నారు. అయ్యో.. ఎన్ని కష్టాలొచ్చాయో.. దేవుడా? అని కన్నీరు మున్నీరు అయ్యారు. ఒకే గ్రామంలో.. ఓ సర్పంచి.. ఉప సర్పంచి (Sarpanch.. Sub-Sarpanch) వేర్వేరు కారణాలతో ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) చలించిపోయారు. ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన ఏపీలో తీవ్ర సంచలనం రేపింది. ప్రాథమిక వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం చినలింగాయపాలెం సర్పంచ్ గురివిందపల్లి యోహాను, ఉప సర్పంచ్ చుండూరు గిరిబాబు వేర్వేరుగా బలవన్మరణాలకి పాల్పడ్డారు. కుటుంబ సమస్యలతో సర్పంచి, ఆర్థిక వెతలతో ఉపసర్పంచి రెండు రోజుల కిందట ఆత్మహత్యకు ప్రయత్నించారు. సర్పంచిని గుంటూరు ఆసుపత్రికి, ఉప సర్పంచిని పొన్నూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు రోజులు ఆసుపత్రి చికిత్స పొందుతున్న వీరిద్దరూ శనివారం మృతి చెందారు. ఈ సమాచారంతో చిన లింగాయపాలెం (China Lingayapalem) చిన్నబోయింది. గ్రామస్తులు తమ నాయకుల మృతదేహాలను గ్రామానికి తరలించారు.

డిప్యూటీ సీఎం విచారం

ఈ సమాచారంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవాలి. ఒకే గ్రామానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ ఈ విధంగా మృతి చెందటం బాధాకరం. వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పాలని పంచాయతీరాజ్ అధికారులకు(Panchayat Raj officials) సూచించారు. ఈ ఆత్మహత్యలకి దారి తీసిన పరిస్థితులను విచారించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

Leave a Reply