ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం

తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని వెలికట్ట గ్రామ సర్పంచ్ బందు శ్రీనివాస్ తెలిపారు.బాలవికాస ఆధ్వర్యంలో మండలంలోని వెలికట్ట గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రంను శుక్రవారం సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ….సామాజిక బాధ్యతతో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

వేసవి తాపం నుంచి ఉపశమనానికి చల్లటి నీళ్లు అందించేందుకు బాలవికాస చొరవ చూపడం ప్రశంసనీయమన్నారు. గ్రామానికి వచ్చే బాటసారుల దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిందన్నారు. మూడు మాసాల పాటు తాము బాటసారులకు చల్లటి మంచినీరు అందించేందుకు బాలవికాసకు తోడ్పాటు నందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలవికాస కో ఆర్డినేటర్ ఎం. సరిత, గ్రామ కార్యదర్శి శ్రీలత, ఉప సర్పంచ్ అల్లంనేని అనిల్ రావు, వార్డు సభ్యులు వీరమనేని రమేష్ రావు, కారోబార్ రమేష్, గ్రామస్తులు, బాలవికాస మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply