తహసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తహసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తొర్రూరు తహసిల్దార్ గడీల శ్రీనివాస్ తెలిపారు.

గురువారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ప్రజల కోసం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవికాలంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వేసవిలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోకుండా, వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా మంచినీరు తాగాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఉప్పుల నరసయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీమొద్దిన్, కంటాయపాలెం సర్పంచ్, ఉప సర్పంచ్, మడిపల్లి సర్పంచ్, జీపీఓలు, కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply