అనంతలోకాలకు చిన్నారులు
కొత్తగూడెం, ఆంధ్రప్రభ : దసరా పండగ అని తాతగారింటికి వచ్చిన ఓ ఇద్దరూ చిన్నారులు ఆటకని వెళ్లి అనంతలోకాలకు వెళ్లిపోయిన సంఘటనతో మహబూబాబాద్(Mahbubabad) జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సారయ్య, నర్సమ్మ(Saraiah, Narsamma) ఇంటికి దసరా పండగ కోసం మనుమళ్లు వచ్చారు.
దసరా పండగా సంతోషంగా గడిచిపోయింది. అయితే ఈ రోజు ఉదయం సారయ్య కుమారుడు నర్సయ్య కుమారుడు రీతిక్ (10), శ్రీనివాస్ కుమారుడు జతిక్ (9) కనిపించకపోవడంతో ఆడుకోవడానికి వెళ్లి కనిపించలేదు. దీంతో వారి కోసం తల్లిదండ్రులు(Parents), కుటుంబ సభ్యులు వెతికారు. అయితే వ్యవసాయ బావి వద్ద వారిద్దరి దుస్తులు కనిపించాయి. దీంతో వ్యవసాయభావిలో చూడగా రీతిక్(Rithik) మృతదేహం లభ్యమైంది. జతిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
