Chhattisgarh | 12మంది మావోయిస్టుల లొంగుబాటు..

Chhattisgarh | 12మంది మావోయిస్టుల లొంగుబాటు..
Chhattisgarh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బస్తర్ రేంజ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్. పి.బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో మొత్తం 12 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒక డీవీసీఎం, బెటాలియన్ నెంబర్ 2 సంబంధించిన ఇద్దరు మావోయిస్టులు, పీ.పీ.సీ.ఎం ఒకరు, ఏసీఎం ఇద్దరు, పార్టీ మెంబర్లు ఇద్దరు, పీఎల్ జీఏ బెటాలియన్ కి సంబంధించిన నలుగురు సభ్యులు ఉన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులపై రూ.54 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగుబాటుకు వచ్చిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలు ఒక ఏ కే 47, ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఆటోమేటిక్ ఆయుధంతో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులకు అప్పగించారు.
