Cherla | 63మంది మావోయిస్టుల లొంగుబాటు

Cherla | 63మంది మావోయిస్టుల లొంగుబాటు

  • 36మందిపై ఒక కోటి 17 లక్షలు రివార్డ్

Cherla | చర్ల, ఆంధ్రప్రభ : ఆపరేషన్ కగార్ తో అగ్రనాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి మరో వైపు లొంగుబాట్లు ఆ పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఛ‌త్తీస్ గ‌ఢ్‌ దంతెవాడ జిల్లాలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ ఎస్ పి గౌరవ్ రాయ్ ఎదుట 63మంది మావోయిస్టులు లొంగిపోగా, వారిలో 36మంది పై ఒక కోటి 17 లక్షల రివార్డ్ ఉంది. నాలుగు రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోగా, ఇవాళ‌ 63మంది మావోయిస్టులు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి.

Leave a Reply