Chennur | కాంగ్రెస్‌కు బిగ్‌షాక్

Chennur | కాంగ్రెస్‌కు బిగ్‌షాక్
- మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజీనామా
Chennur | చెన్నూరు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ రోజునే మంత్రి వివేక్ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని, ఎమ్మెల్యే మంత్రి వివేక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకపోవడం వల్ల పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనుపడుతుందన్నారు.
21న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి..
ఈనెల 21న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు
