Chennur | కౌన్ బనేగా ఛైర్ పర్సన్..

Chennur | కౌన్ బనేగా ఛైర్ పర్సన్..
Chennur, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపల్ నూతన పాలకవర్గం మరి కొన్ని గంటల్లో ఆశీనులు కానుంది. ఇందుకు గాను అధికారులు మున్సిపల్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పట్టణాన్ని జనాభ ప్రతిపాదన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం 20 జనవరి 2020లో మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసి చెన్నూరులో మొదటి సారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది. పాలక వర్గం ఎన్నిక కూడ టీఆర్ఎస్ మెజార్టీ చూపిస్తూ మొదటిసారి ఛైర్ పర్సన్ గా పట్టణానికి చెందిన మార్వాడి కమ్యూనిటీ నుంచి అర్చన రాంలాల్ గిల్డా ఐదు సంవత్సరాల (20జనవరి 2025) పాలన చేపట్టారు.
సంవత్సరం పాటు ఎన్నికల నిర్వహణ లేక అధికారులచే పాలన వ్యవస్థ కొన సాగింది. నేటి నుంచి జరుగనున్న పాలన రెండవదిగా చెప్పుకోవచ్చు. ఈ నెల 13న జరిగిన కౌన్సిలర్ల ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు సరిపడ మ్యాజిక్ ఫిగర్ (11) కైవసం చేసుకొని నేడు (సోమవారం) నియోజక వర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి, అధికారుల సమక్షంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు స్థానిక కార్యాల్యంలో రహస్య(తాత్కాలిక) సమావేశాహల్ ను ఏర్పాటు చేశారు.
ఇక ఛైర్ పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయం నిన్న రాత్రి వరకు స్థానిక క్యాంప్ కార్యాలయంలో మంత్రి వివేక్ ద్వితీయ శ్రేణి నాయకులతో భేటీ అయ్యారు. అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించకపోవడంతో అభ్యర్థుల వర్గీయులలో కొంత టెన్సన్ నెలకొంది. ఎన్నికల అనంతరం క్యాంప్ కు వెళ్ళిన సభ్యులు మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకరానికి హాజరు కానున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పట్టణ ప్రజలు నూతన ఛైర్ పర్సన్ ఎవరు అనేది తెలుసుకునేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

