Chennur | టౌన్ సీఐగా బన్సీలాల్

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ హెచ్ వోగా సీఐ బన్సిలాల్ ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది పూర్తి సహకారం అందించాలని సీఐ బన్సిలాల్ కోరారు.
