Chennaraopet | గ్రామాభివృద్దే ధ్యేయంగా పని చేస్తా

Chennaraopet | గ్రామాభివృద్దే ధ్యేయంగా పని చేస్తా

  • అక్కలచెడ సర్పంచ్ భూక్య బుజ్జిసురేష్

Chennaraopet | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : పార్టీలకతీతంగా అందరిని కలుపుకుని అక్కలచెడ గ్రామాభివృద్దే ధ్యేయంగా పని చేస్తానని అక్కలచెడ గ్రామ నూతన సర్పంచ్ భూక్య బుజ్జిసురేష్ అన్నారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా గెలిచిన బుజ్జి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులు, మండల కాంగ్రేస్ పార్టీ మాజీ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్, గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు పులిశేరు రాజేందర్, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్ గా గెలుపొందామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎమ్మెల్యే దొంతి సహకారంతో నెరవేర్చుతామని, కట్టయ్యపల్లె కి ఉప సర్పంచ్ పదవి ఇవ్వడం తొలి అడుగు అని అన్నారు.

ఐదేళ్ల పదవి కాలంలో అర్హతే ప్రామాణికంగా ఇందిరమ్మ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తామని అన్నారు. నాతో పాటు పదవి భాధ్యతలు చేపట్టిన ఉప సర్పంచ్ రజిత, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం తమ గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సర్పంచ్ దంపతులు శాలువాలు కప్పి సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ మాజీ అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్, గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు పులిశేరు రాజేందర్, పంచాయతీ కార్యదర్శి చేరాలు, ఉప సర్పంచ్ కక్కెర్ల రజిత, వార్డు సభ్యులు ఒంటరి రాజు,తూటి రాణి, సంకెళ్ల శ్రీకాంత్, ఇస్లావత్ స్వరూప, బాదావత్ సురేష్, భూక్య నవీన్, మాలోత్ పద్మ , భూక్య యాదమ్మ, కోరే మల్లయ్యలు పాల్గొన్నారు.

Leave a Reply