పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయి…

పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయి…
బిక్కనూరు, ఆంధ్రప్రభ : కెమికల్ పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయని నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమల అనుమతులు రద్దు చేయాలని మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ సాయ గౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి గ్రామ సచివాలయ పాలకవర్గ తీర్మాన పత్రాన్ని అందజేశారు. అనంతరం సాయా గౌడ్ మాట్లాడుతూ… ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతనంగా మండల పరిధిలో కెమికల్ తో పాటు ఇతర పరిశ్రమలకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయని ఆవేదన చెందారు. అట్టి అనుమతులను తక్షణమే రద్దు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.
