వైభవంగా లక్ష్మమ్మఅవ్వ రథోత్సవం

వైభవంగా లక్ష్మమ్మఅవ్వ రథోత్సవం
మంత్రాలయం,ఆంధ్ర ప్రభ : మండలంలోని బూదురు గ్రామంలో శ్రీ లక్ష్మమ్మ అవ్వ రథో త్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మమ్మ అవ్వ దేవాలయమును పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయాన్నే లక్ష్మమ్మకు ప్రత్యేక పూజలు జలాభిషేకం, కుంకుమార్చన, ఆకు పూజలు, పంచామృతాభిషేకం, తదితర సంస్థాన పూజలు నిర్వహించారు. గ్రామస్తులు శ్రీ లక్ష్మమ్మ అవ్వను దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. సాయంత్రం రథోత్సవ వేడుకలు వైభవంగా ఊరేగించారు.
వివిధ గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. రథోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయు సంఘటన జరగకుండా మంత్రాలయం సీఐ రామానుజులు ఆధ్వర్యంలో ఎస్ ఐ మల్లికార్జున బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లక్ష్మీనారాయణ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
