Charan – Akhil | లెనిన్ ని టెన్షన్ పెడుతున్న పెద్ది..

Charan – Akhil | లెనిన్ ని టెన్షన్ పెడుతున్న పెద్ది..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా హీరో రామ్ చరణ్, అక్కినేని హీరో అఖిల్.. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే.. ఈ ఇద్దరు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నారా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. చరణ్ పెద్ది సినిమా చేస్తుంటే.. అఖిల్ లెనిన్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల (Movies) నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తే.. యుట్యూబ్ ని షేక్ చేసి రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లాయి. సినిమా పై అంచనాలు మరింతగా పెంచాయి. ఇంతకీ.. లెనిన్, పెద్ది వచ్చేది ఎప్పుడు..? చరణ్, అఖిల్ మధ్య పోటీ తప్పదా..?

Charan – Akhil | లెనిన్ కథ కూడా రెగ్యులర్ స్టోరీలా కాకుండా..
అక్కినేని అఖిల్.. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సరైన బ్లాక్ బస్టర్ సాధించాలని తపిస్తున్నాడు. హామ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అయితే.. కాలం కలిసి రాకపోవడం వలన ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ రాలేదు. ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని తపిస్తున్నాడు. లెనిన్ కథ కూడా రెగ్యులర్ స్టోరీలా కాకుండా.. ఓ డిఫరెంట్ స్టోరీతో డైరెక్టర్ (Director) మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అవ్వడంతో సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

Charan – Akhil | పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్
ఇదిలా ఉంటే.. చరణ్ పెద్ది సినిమాని డైరెక్టర్ బుచ్చిబాబు సానా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కూడా యూట్యూబ్ ని షేక్ చేయడంతో మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ సినిమాని మార్చి 27న రిలీజ్ (Release) చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ప్లాన్ మారిందట. ఈ డేట్ కి పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని.. పెద్ది సినిమా మే 1న విడుదల అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే.. లెనిన్, పెద్ది మధ్య పోటీ తప్పదా..? చరణ్, అఖిల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరోఒకరు డేట్ మార్చుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి.. ఏం జరగనుందో..?

