ఘనంగా కుస్తీ పోటీలు, కామదహనం, హోలీ సంబరాలు..

ఘనంగా కుస్తీ పోటీలు, కామదహనం, హోలీ సంబరాలు..
చందూర్, ఆంధ్రప్రభ : చందూర్ మండలంలో హోలీ పండుగ ఒకరోజు ముందుగానే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చందూర్, ఘన్పూర్ లక్ష్మాపూర్ గ్రామాలలో సరగమ దేవత కొలువైనందున ఒకరోజు ముందుగానే హోలీ పండుగ జరుపుకుంటారు. ఈరోజు తెల్లవారుజామున గ్రామాలలో కుస్తీ పోటీలను నిర్వహించి కామ దహనాన్ని చేసి అనంతరం హోలీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాడ వాడల యువకులు, చిన్నపిల్లలు రకరకాల రంగులను చల్లుకుంటూ కుతూహలంగా పండుగను జరుపుకున్నారు.


