West Godavari – పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు చంద్ర బాబు పర్యటన
ఏలూరు – పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. . ఈ సందర్భంగా వాసవీ మాత ఆలయాన్ని సందర్శించనున్నారు చంద్రబాబు నాయుడు దంపతులు.
అనంతరం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొననున్నారు . అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.
ఇక రేపు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు వెళ్లనున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్న ఆయన రేపు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను పంపిణీ చేయనున్నారు.
రేపు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు.కడప ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకోనున్నారు. హెలిపాడ్ నుండి కాన్వాయ్ ద్వారా సంబేపల్లి చేరుకొని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు