లండన్‌లో చంద్రబాబు దంపతులు..

  • తెలుగు కుటుంబాల సాదర స్వాగతం.
  • నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గౌరవం
  • ప్ర‌జాసేవ‌కు ప్ర‌త్యేక గుర్తింపు..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి లండన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్‌ తెలుగు కుటుంబాలు విమానాశ్రయంలో సీఎం దంపతులకు స్వాగతం పలికాయి. భువనేశ్వరి, చంద్రబాబు దంపతులు వారిని ఆప్యాయంగా పలకరించారు.

ఈ నెల 4వ తేదీన లండన్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (IOD) నిర్వహించే కార్యక్రమంలో నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకోనున్నారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా ప్రజాసేవ, సామాజిక ప్రభావం రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌ 2025’ అవార్డు నారా భువనేశ్వరికి లభించింది. అలాగే, హెరిటేజ్‌ ఫుడ్స్ సంస్థకు కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో ఉన్నత ప్రమాణాలకు గుర్తింపుగా ‘గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు’ దక్కింది. ఈ అవార్డును సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నారా భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు.

Leave a Reply