Chandi Homam | రామాలయంలో చండీ హోమం..

Chandi Homam | రామాలయంలో చండీ హోమం..

  • వసంత పంచమి వేడుకలు
  • వేడుకల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు

Chandi Homam | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని శివనగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో చండీ హోమం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం శివనగర్ రామాలయంలోని హోమశాలలో చండీ హోమం వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించారు. శ్రీ లలితా దేవి అమ్మవారి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు.

Chandi Homam

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు లలితా దేవి అమ్మవారి పాదాల చెంత పెన్నులు బుక్స్ పెట్టి పూజలు, మరికొందరు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ… వసంత పంచమి రోజు విద్యార్థులు సరస్వతి దేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేష ఫలితం లభిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి దంపతులు, కోశాధికారి చింతం యాదగిరి దంపతులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీరామ్ రాజేష్ దంపతులు హోమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు.

Leave a Reply