- ఐదో వికెట్ డౌన్..
- న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే !
దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఐదో వికెట్ పడింది. ఇండియాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యటింగ్ కు దిగిన కివీస్… సంగం బ్యాటింగ్ లైనప్ పెవిలియన్ చేరింది.
టీమిండియా స్పిన్ మంత్రానికి కివీస్ కీలక బ్యాటర్లంతా డగౌట్ కు క్యూ కట్టారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన 37.5వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ ( 52 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 34) ఐదో వికెట్ గా ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (44) – మిచెల్ బ్రేస్వెల్ ఉన్నారు. న్యూజిలాండ్ స్కోర్ 165/5.
కాగా, ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి (2), కుల్దీప్ యాదవ్ (2) జడేజా (1) వికెట్లు పడగొట్టారు.