- రాణించిన బౌలర్లు..
- ఇక బ్యాటర్ల వంతు
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. కెప్టెన్ రోహిత్ అమలు చేసిన స్పిన్ మంత్రం అద్భుతాలు చేసింది. కివీస్ విధ్యంసక బ్యాటర్లను స్వల్ప పరుగులకే పెవిలియన్ చేర్చారు టీమిండియా బౌలర్లు.
ఈ మ్యాచ్ లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, పేసర్ షమీ తలా ఒక్క వికెట్ దక్కించుకున్నారు.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యటింగ్ కు దిగిన కివీస్… నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది.
కాగా, కివీస్ బ్యాటర్లలో విధ్వంసకర ఓపెనర్లు విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14) కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (8) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) పరువాలేదనిపించారు.
అయితే, మిడిలార్డర్ లో డారిల్ మిచెల్ (63), మిచెల్ బ్రేస్ వెల్ (53) చెరో అర్థశతకాలతో చెలరేగారు. దీంతో న్యూజిలాండ్ జట్టు టీమిండియా మందు 252 పరుగుల టార్గెట్ సెట్ చేయగలిగింది.